Good Health : పొటాషియం లోపిస్తే ఇన్ని అనారోగ్య సమస్యలా.. ఇవి తింటేనే సరైన ఆరోగ్యం..!

పొటాషియం లోపిస్తే.. మన శరీరంలో నిత్యం అవసరమయ్యే పోషకాల్లో పొటాషియం ఒకటి.శరీరంలోని అనేక విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు పొటాషియం ఎంతగానో తోడ్పడుతుంది. ఇది తగినంత లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. పొటాషియం లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. . 

  • తీవ్రమైన అలసట వస్తుంది. చిన్న పని చేసినా చాలు త్వరగా అలసిపో తారు. 
  • కాళ్లలో కండరాలు పట్టేస్తాయి. పొటాషియం స్థాయిలు తక్కువగా ఉంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
  •  వికారంగా ఉండి వాంతులు అవుతాయి. కడుపు నొప్పి, గ్యాస్, మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి.
  •  పొటాషియం శరీరంలో ద్రవాలను సమంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
  •  కండరాల సంకోచానికి, ప్రొటీన్ల వినియోగానికి, ఎముకలకు పొటాషియం బలాన్నిస్తుంది..
  •  అరటిపండ్లు, పాలు, చికెన్, చేపలు, తృణ ధాన్యాలు, ఆకుపచ్చని కూర గాయలు, యాపిల్ పండ్లు, బాదం పప్పులలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది.
  •  కాబట్టి ఈ ఆహారాన్ని తరచుగా తీసుకుంటే పొటాషియం లోపం నుంచి తప్పించుకోవచ్చు
-వెలుగు, లైఫ్-