సీఎంను చంపితే పది లక్షలిస్తామంటూ పోస్టర్

సీఎంను చంపితే పది లక్షలిస్తామంటూ పోస్టర్
‘సీఎంను చంపితే పది లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం’.. అంటూ పంజాబ్‌లో శనివారం ఓ పోస్టర్ ప్రత్యక్షమయింది. దాంతో పంజాబ్‌లో ఈ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. మొహాలిలోని సెక్టార్ 66, 67లోని ఓ గోడపై ఈ పోస్టర్ వెలిసింది. అది చూసిన కొంతమంది యువకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారడంతో.. పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే పోలీసులు పోస్టర్ ఉన్న ప్రాంతానికి వచ్చి పోస్టర్‌ను తీసేశారు. ఆ పోస్టర్‌పై ibrahim@hotmail.com అనే మెయిల్ ఐడీ ఉంది. దాంతో పోలీసులు ఆ మెయిల్ ఐడీ ద్వారా నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. పోస్టర్ వెలసిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ‘ముఖ్యమంత్రిని చంపితే పది లక్షల రివార్డు ఇస్తాం అని ఉన్న పోస్టర్‌ను మేం స్వాధీనం చేసుకున్నాం. నిందితులపై ఐపీసీ సెక్షన్ 504, 506, 120 బీ సెక్షన్ల కింద ఫేస్ 11 పోలీస్ స్టేషన్‌లో కేసును నమోదు చేశాం. ఆ పోస్టర్ పై ఉన్న ఈమెయిల్ ఐడీ ద్వారా నిందితులను త్వరలోనే పట్టుకుంటాం’ అని పోలీసులు వెల్లడించారు. కాగా.. గతేడాది డిసెంబర్ 14న మెహాలిలోని బలోంగి-కుంభ రహదారిపై ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లోని అమరీందర్ సింగ్ ముఖంపై నల్లటి సిరాను చల్లారు. For More News.. త్వరలో సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్స్.. పార్టీల ఫోకస్ కూతురితో మహిళా సర్పంచ్​ మిస్సింగ్