పోస్ట్ ఆఫీస్  ఫ్రాంచైజీతో ప్రతి నెలా ఆదాయం 

పోస్ట్ ఆఫీస్  ఫ్రాంచైజీతో ప్రతి నెలా ఆదాయం 

బిజినెస్ డెస్క్, వెలుగు: పోస్టు ఆఫీసు ద్వారా నిరుద్యోగులు ఉపాధి పొందవచ్చు. కష్టపడితే ప్రతి నెలా మంచి ఆదాయం వస్తుంది.  కేవలం రూ. 5,000 ఖర్చుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు వెనకేయవచ్చు. ఇందుకోసం పోస్ట్ ఆఫీస్  ఫ్రాంచైజీని తీసుకొని సేవలు అందించాలి.  ప్రస్తుతం దేశంలో దాదాపు 1.55 లక్షల పోస్టాఫీసులు ఉన్నప్పటికీ, అన్ని చోట్లకూ సేవలు అందడం లేదు. అందుకే  ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. పోస్టాఫీసు రెండు రకాల ఫ్రాంచైజీలను ఇస్తుంది. మొదటిది ఫ్రాంచైజ్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌లెట్ కాగా,  రెండవది పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీ. వీటిలో దేనినైనా తీసుకోవచ్చు. పట్టణ,  గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు  స్టేషనరీలను ఇంటింటికీ తిరిగి అందజేసే ఏజెంట్లను పోస్టల్ ఏజెంట్లు అంటారు. ఫ్రాంచైజీని పొందడానికి కేవలం రూ. 5000 ఖర్చు చేస్తే చాలు. ఫ్రాంచైజీని పొందిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌పై కమీషన్ వస్తుంది.  ఎంత సంపాదించవచ్చు అనేది మీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

పోస్టాఫీసు ఫ్రాంచైజీని ఎవరు తీసుకోవచ్చు?
1.    ఫ్రాంచైజీని తీసుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.
2.    భారతీయ పౌరులు ఎవరైనా పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకోవచ్చు.
3.    అప్లికెంట్ గుర్తింపు పొందిన స్కూల్ నుండి 8వ తరగతి పాసైనట్టు  సర్టిఫికెట్ ఉండాలి.
4.    ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయడానికి సంబంధిత ఫారం నింపి పోస్టు ఆఫీసులో
 అందజేయాలి. 
5.    సెలక్ట్ అయ్యాక ఇండియా పోస్ట్‌‌‌‌‌‌‌‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయాలి.

కమీషన్ ఎంత వస్తుందంటే..
1.    రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బుకింగ్ పై రూ. 3
2.    స్పీడ్ పోస్ట్, ఆర్టికల్స్​  బుకింగ్ పై రూ. 5
3.    రూ. 100 నుండి రూ. 200 వరకు విలువైన మనీ ఆర్డర్ బుకింగ్‌‌‌‌‌‌‌‌పై రూ. 3.50
4.    రూ. రూ. 200 కంటే ఎక్కువ మనీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌పై రూ.5
5.    నెలలో రిజిస్ట్రీ,  స్పీడ్ పోస్ట్‌‌‌‌‌‌‌‌ల సంఖ్య 1000 కంటే ఎక్కువ ఉంటే 20 శాతం అదనపు కమీషన్
6.    స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ,  మనీ ఆర్డర్ ఫారమ్ అమ్మకంపై 5శాతం కమీషన్
7.    రెవెన్యూ స్టాంపులు, సెంట్రల్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫీజు స్టాంపులు మొదలైన వాటితో సహా రిటైల్ సేవలపై పోస్టల్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ సంపాదించిన ఆదాయంలో 40 శాతం.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీలకు  దరఖాస్తు చేయడం ఇలా
స్టెప్1:    దరఖాస్తుదారులు ఫ్రాంచైజ్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌లో చేపట్టాల్సిన కార్యకలాపాలను వివరించే బిజినెస్ ప్లాన్ పాటు సంబంధిత అప్లికేషన్ ఫారం నింపి పోస్ట్ ఆఫీసులో ఇవ్వాలి. 
స్టెప్ 2:    దరఖాస్తు ఫారం పోస్ట్ ఆఫీస్ నుండి తీసుకోవచ్చు.  పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ నుండి కూడా డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజ్ అవుట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా అందజేసే సేవలను వివరిస్తూ ప్రపోజల్ కాపీని సంబంధిత బ్రాంచ్​లో అందజేయాలి.  
స్టెప్3:    ఫారమ్ అందజేశాక, సంబంధిత ఫ్రాంచైజీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో మెమో రాండం ఆఫ్ అగ్రిమెంట్ (ఎంఓఏ)పై సంతకం చేయాలి.
స్టెప్ 4:    పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ కోసం అప్లికేషన్ అందజేసిన తేదీ నుండి 14 రోజులలోపు సంబంధిత డివిజనల్ హెడ్ ద్వారా సెలక్షన్‌‌‌‌‌‌‌‌  సమాచారం వస్తుంది.