పాతకార్ల బిజినెస్​లోకి పోర్షే

పాతకార్ల బిజినెస్​లోకి పోర్షే

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే భారత్‌‌లో ప్రీ-ఓన్డ్ కార్ల విభాగంలోకి ప్రవేశించింది. పాతకార్లకు  కఠినమైన 111 పాయింట్ల తనిఖీ తర్వాత 24 గంటల రోడ్‌‌సైడ్ సర్వీస్‌‌ సహా కనీసం 12 నెలల పాటు పూర్తి వారంటీ ఇస్తామని తెలిపింది. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు భారతదేశం అంతటా అందుబాటులో ఉందని  ప్రకటించింది. మరిన్ని పోర్షే కార్లు భారతీయ రోడ్లపై తిరిగేలా చేస్తామని తెలిపింది.