పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం : హరికృష్ణ

  • కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి హరికృష్ణ 

సిద్దిపేట రూరల్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరి కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని ఇరుక్కోడు గ్రామ శివారులో ఉన్న లావణ్య గార్డెన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవానికి అందేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు.

ప్రభుత్వం ఏర్పాటైన 11 నెలల్లోనే  55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. నియోజకవర్గానికి 3500 డుబుల్ బెడ్ రూమ్ ఇండ్లు త్వరలో మంజూరవుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్నతప్పుడు ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బుచ్చి రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, గోపి కృష్ణ, పాండు, అంజిరెడ్డి, రాములు, మల్లారెడ్డి, సదాశివారెడ్డి, మహేందర్ రెడ్డి, పాల్గొన్నారు.