కేంద్రంలోనూ కాంగ్రెస్ ‌‌ సర్కారు రావాలి : పొన్నం ప్రభాకర్​

పాలమూరు, వెలుగు : రాష్ర్టంలో కాంగ్రెస్​ రూలింగ్​లో ఉందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే డబుల్ ‌‌ ఇంజన్ ‌‌ సర్కారులో తెలంగాణ మరింత అభివృద్ధి  చెందుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‌‌చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్​హాల్​లో ఆదివారం గౌడ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ‌‌ కుమార్ ‌‌  గౌడ్ ‌‌ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి పొన్నంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్​నగర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​రెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్​రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మనుగడ సాధించాలంటే రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కాంగ్రెస్ ‌‌ గెలువాలన్నారు. కుల గణన జరగకుండా కొందరు కోర్టులో కేసులు వేశారని, ఎట్టి పరిస్థితుల్లో కుల గణన చేసి తీరుతామన్నారు. 

తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి, బీఆర్ఎస్  చేస్తున్న విమర్శలను తిప్పికొడతామని తెలిపారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్  లీడర్లకు పార్లమెంట్​ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ‌‌ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గౌడ కులస్తులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు. 

గౌడ కులస్తుల ఆదాయం పెంచేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అనాదిగా వస్తున్న కల్లు గీత వృత్తి కనుమరుగవుతుందని, ఆ వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్  చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గౌడ్ ‌‌, లక్ష్మణ్ యాదవ్, మీడియా సెల్ కన్వీనర్  సీజే బెనహర్  పాల్గొన్నారు.