జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

 జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కొకైన్ తీసుకున్నట్లు తేలిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మండలిలో క్వశ్చన్ అవర్  సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటనర్సింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం సమాధానం ఇచ్చారు . ఫామ్ హౌస్ లలో దావత్ లు, మద్యం వినియోగించుకునేందుకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని తెలిపారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మద్యం పేరుతో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తే ఊరుకోబోమన్నారు పొన్నం. ఇక డ్రగ్స్ కేసులో సినీతారలు,రాజకీయ నాయకులు ప్రముఖులు సహా ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు

Also Read :- హైదరాబాద్ అల్కాపురి కాలనీలో హైడ్రా దూకుడు

2024 అక్టోబర్ 28న  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ బామ్మర్ది రాజ్  పాకాల ఫామ్​హౌస్​లో దావత్​ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. జన్వాడలోని ఫామ్​హౌస్​లో శనివారం అర్ధరాత్రి రేవ్​ పార్టీ జరుగుతున్నదంటూ స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ  సోదాలు చేశారు. భారీగా లిక్కర్​ దొరికింది. ఇందులో 12  ఫారిన్ లిక్కర్‌‌‌‌ బాటిళ్లు కూడా ఉన్నాయి. క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్‌‌ కార్డ్స్​ కూడా పట్టుబడ్డాయి.  పార్టీలో 40 మందికిపైగా పాల్గొన్నట్లు గుర్తించారు. 22 మందికి డ్రగ్స్​ ర్యాపిడ్‌‌ టెస్ట్‌‌లు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్‌‌ మద్దూరి డ్రగ్స్​ (కొకైన్)​ తీసుకున్నట్లు తేలింది. తనకు డ్రగ్స్​ను ఇచ్చింది రాజ్​ పాకాల అని పోలీసుల విచారణలో విజయ్​ మద్దూరి వెల్లడించాడు. 

 ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ పాకాలను పోలీసులు విచారించారు. అసలు రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు.