మే 24న పాలిసెట్ ​ప్రవేశ పరీక్ష

మెదక్​టౌన్, వెలుగు: ఈ నెల 24న జరిగే పాలిసెట్​ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్​మహిళాపాలిటెక్నిక్​కాలేజీ ప్రిన్సిపాల్​సువర్ణలత తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 

మెదక్ పట్టణంలో ప్రభుత్వ బాలికల స్కూల్​ బ్రాహ్మణవీధి, గవర్నమెంట్​డిగ్రీ కాలేజ్​హౌసింగ్ బోర్డ్ కాలనీ,  సిద్దార్థ ఆదర్శ జూనియర్ కాలేజ్ బ్రాహ్మణవీధి, సిద్ధార్థ మోడల్ హై స్కూల్- వెంకట్​రావునగర్​ కాలనీ  సెంటర్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. స్టూడెంట్స్​సమయానికి  పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.