‘పొలిమేరాస్‌‌‌‌‌‌‌‌’ను కొన్న జీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌

‘పొలిమేరాస్‌‌‌‌‌‌‌‌’ను కొన్న జీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కూరగాయలు, పండ్లు అమ్మే పొలిమేరాస్‌‌‌‌ రిటైల్‌‌‌‌ స్టోర్ల చెయిన్‌‌‌‌లో వంద శాతం వాటాలు కొన్నామని జీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఇన్ఫోటెక్‌‌‌‌ ప్రకటించింది. ఇది స్టాక్‌‌‌‌, క్యాష్ డీల్‌‌‌‌ అని వెల్లడించింది. రూ.250 కోట్ల వాల్యుయేషన్‌‌‌‌ దగ్గర పొలిమేరాస్‌‌‌‌ను కొన్నామని జీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఇన్ఫోటెక్‌‌‌‌ సీఈఓ మారెపల్లి భార్గవ తెలిపారు. ఈ డీల్‌‌‌‌కు షేర్‌‌‌‌హోల్డర్లు,   రెగ్యులేటర్ల అనుమతి రావాల్సి ఉంది. హైదరాబాద్‌‌‌‌, బెంగళూరులో పొలిమేరాస్‌‌‌‌కు 75 స్టోర్లు ఉన్నాయి. ఒక్కో స్టోరుకు నెలకు దాదాపు 21 వేల మంది వరకు కస్టమర్లు వస్తారు.