ఛత్తీస్​గఢ్​లో పాలిమేటెడ్​ ప్లాంట్​

హైదరాబాద్, వెలుగు:  సెమీకండక్టర్ చిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ పాలిమేటెక్ ఎలక్ట్రానిక్స్, తన రెండో ప్లాంటును నయా -రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయనుంది.  ఢిల్లీలో జరిగిన ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ ఇన్వెస్టర్ కనెక్ట్ 2024 ఈవెంట్ సందర్భంగా ముఖ్యమంత్రి  విష్ణు దేవ్ ఈ ప్రకటన చేశారు.  

కార్డిఫ్ సహకారంతో, 5.925 గిగాహెజ్​,  13.75 గిగాహెజ్​ నోడ్స్, ఎన్​102–-104 మధ్య ఫ్రీక్వెన్సీల కోసం సెమీకండక్టర్ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉత్పత్తి చేస్తామని తెలిపింది. ఈ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అధునాతన ప్యాకేజింగ్ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ కొత్త ఫెసిలిటీలో చేస్తారు. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గ్రెనోబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాలిమాటెక్ ఫౌండ్రీ ఏర్పాటయింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం పాలిమేటెక్  రూ.1,143 కోట్లు ఇన్వెస్ట్​చేస్తుంది. ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 40 శాతం మూలధన రాయితీని అందిస్తోంది.