ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు(గురువారం) ఉత్తరప్రదేశ్ లో మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. కరోనా ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడతలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్ధానాలకు పోలింగ్ జరగనుంది. 623 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. సుమారు.2.27 కోట్ల మంది రేపు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ కు ప్రచారం నిన్నటితో ముగిసింది.
మొదటి విడత ఎన్నికల బరిలో 9 మంది మంత్రులు పోటీ చేస్తున్నారు. వీరిలో సురేశ్ రాణా, అతుల్ గార్గ్, శ్రీకాంత్ శర్మ, సందీప్ సింగ్, అనిల్ శర్మ, కపిల్ దేవ్ అగర్వాల్, దినేష్ ఖాటిక్, డాక్టర్ జీఎస్ ధర్మేష్, చౌదరి లక్ష్మీ నారాయణ్ ఉన్నారు. పోలింగ్ జరగనున్న జిల్లాల్లో.. ప్రబుద్ధ్ నగర్ (షామ్‌లి), మీరట్, హాపూర్ (పంచ్‌శీల్ నగర్), ముజఫర్‌నగర్, బాఘ్‌పట్, ఘజియాబాద్, బులంద్‌శహర్, అలీగఢ్, ఆగ్రా, గౌతమ్‌బుద్ధ్ నగర్, మథుర ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం..
