మార్కెట్లోకి పొలిటికల్ చాక్లెట్లు, బిస్కెట్లు - క్యూ కడుతున్న నేతలు... 

2024 సార్వత్రిక సమరానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతలంతా ప్రచార బాట పట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసం నాయకులు నానా తిప్పలు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్కరు ఒక యూనిక్ స్టయిల్ ని ఫాలో అవుతున్నారు. ఎనలేని హాయిలు కురిపించటం కొందరి స్టైల్ అయితే, కొత్త కొత్త పద్దతిలో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకోవడం ఇంకొంతమంది స్టైల్. ఇప్పటిదాకా రకరకాల పోకడలతో ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్ల మీద పడ్డారు.

కేరళలోని కోజికోడే నగరం ఈ కొత్త తరహా ప్రచారానికి వేదిక అయ్యింది. కోజికోడేకు చెందిన ఆషిక అనే మహిళ చాక్లెట్లు తయారు చేసే మహిళ ఈ తరహా ప్రచారానికి నాంది పలికింది. ఈ ప్రచారం సక్సెస్ అవ్వటంతో ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాకుండా అస్సాం, తెలంగాణ, మహారాష్ట్ర, ఇలా దేశం నలుమూలల నుండి ఆర్దర్లు వస్తున్నాయి. కేరళలోని వకార పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన షఫీ పిరంబిల్ మొట్టమొదట ఈ చెక్లెట్లను ప్రచారానికి వాడుకున్నాడట. తెలంగాణకి చెందిన పది మంది నాయకులు కూడా ఈ చాక్లెట్లను ఆర్డర్ చేశారట. తెలంగాణ నాయకులు ఒక్కొక్కరూ ఒక 1000 చాక్లెట్లు కావాలని ఆర్డర్ చేసినట్లు ఆషిక తెలిపింది.

Also Read: బీజేపీలో చేరిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు