నేషనల్​ కాంగ్రెస్ ఆవిర్భావం.. లక్ష్యం

19వ శతాబ్దంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. అయితే, అఖిల భారత ప్రాతిపదికగా ఏర్పడిన సంఘ ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​. విలియం వెడ్​బర్న్​, చార్లెస్​ బ్రాడ్​లా, జార్జీ యూల్​ల సహాయంతో ఏఓ హ్యూమ్​ ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​ను 1885, డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్​దాస్​ తేజ్​పాల్​ సంస్కృత కళాశాలలో స్థాపించాడు. ఈ సంస్థ అసలు పేరు అయిన ఇండియన్​ యూనియన్​ను ఏఓ హ్యూమ్​ ప్రతిపాదించాడు. 

కానీ మొదటి సమావేశంలో భారత​ జాతీయ కాంగ్రెస్​ అనే పేరును దాదాబాయి నౌరోజీ సూచించారు. ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యులు ఏఓ హ్యూమ్​, ఫిరోజ్​షా మెహతా, దాదాభాయ్​ నౌరోజీ, దిన్షావాచా, డబ్ల్యూసీ బెనర్జీ. బద్రుద్దీన్​ త్యాబ్జీ. 1888లో లండన్​లో ఏర్పడ్డ ఐఎన్​సీ బ్రిటిష్​ కమిటీ 1889లో ఇండియన్​ అనే వార పత్రికను ప్రారంభించి భారతీయుల బాధలను బ్రిటిష్​ ప్రజలకు, వారి శాసనసభలకు తెలియజేయాలని పూనుకున్నారు. 


1857 తిరుగుబాటు తర్వాత భారత్​లో బ్రిటిష్​కు వ్యతిరేకంగా మరో తిరుగుబాటు జరగకుండా జాగ్రత్త పడటానికి, భారతీయుల కోసం ఒక సంస్థాపరమైన వేదికను అందించడం కోసం ఈ సిద్ధాంతం ఉద్దేశించడమైంది. ఈ సిద్ధాంతాన్ని విమర్శిస్తూ మితవాదులపై లాలా లజపతిరాయ్​ 1916లో యంగ్​ ఇండియా పుస్తకంలో విరుచుకుపడ్డాడు. ఆర్​.పి.దత్తా తన ఇండియా టు డే ద్వారా లాలా లజపతిరాయ్​ చేసిన వ్యాఖ్యలను వెలుగులోకి తీసుకొచ్చారు.

 1939లో ఆర్​ఎస్​ఎస్​ అధినేత ఎంఎస్​ గోల్వాల్కర్​ ఈ సిద్ధాంతం ఆధారంగా కాంగ్రెస్​ను విమర్శించాడు. సి.ఎఫ్.ఆండ్రూస్​, గిరిజా ముఖర్జీ తమ గ్రంథాలైన రైజ్​ అండ్​ గ్రోత్​ ఆఫ్​ కాంగ్రెస్​ ఇన్​ ఇండియాలో ఈ సిద్ధాంతాన్ని ఆమోదించాడు. రెండో సమావేశం(1886 డిసెంబర్​ 27, కలకత్తా): ఈ సమావేశానికి సురేంద్రనాథ్​ బెనర్జీ హాజరయ్యాడు. మొత్తం 436 మంది ప్రతినిధులు హాజరు కాగా, అధిక సంఖ్యలో బెంగాల్​ నుంచి 230 మంది హాజరయ్యారు. 

తీర్మానాలు: శాసనమండలుల విస్తరణ, సివిల్​ సర్వీసు పరీక్షల విషయ పరిశీలనకు కమిటీ. 

ఐదో సమావేశం(1889, బొంబాయి): భారత్​లోని బ్రిటిష్​ ప్రభుత్వాధికారుల వ్యతిరేక ధోరణి దృష్ట్యా బ్రిటన్​లో కాంగ్రెస్​ ఉద్ధృత ప్రచారం చేయాలని హ్యూమ్​ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్​ ప్రతినిధి సంస్థగా ఒక బ్రిటిష్​ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి వెడ్​బర్న్​ అధ్యక్షునిగా నౌరోజీతోపాటు కెయిన్​, బ్రైట్​లు సభ్యులుగా, డిగ్బీని కార్యదర్శిగా నియమించారు. 

తీర్మానాలు: కేంద్ర, రాష్ట్ర శాసనమండలులలో ఎన్నికైన సభ్యుల సంఖ్య సగానికి తగ్గకుండా ఉండాలి. అధికార సభ్యుల సంఖ్య నాలుగో వంతుకు పరిమితం కావాలి. మిగతా సభ్యులు ప్రభుత్వ నియమితులు.

ఎన్నికలకు రెవెన్యూ జిలలాయే ప్రాదేశిక నియోజకవర్గమై ఉండాలి.

21 సంవత్సరాల కనీస వయస్సు ఉన్న వారు ఓటర్లు, వీరు కేంద్ర శాసన మండలికి 50 లక్షల జనాభాకు ఒక సభ్యుడు, రాష్ట్ర శాసనమండలికి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు చొప్పున సభ్యులను ఎన్నుకుంటారు.

పార్శీ, క్రైస్తవ, ముస్లిం, హిందూ వర్గాలు కొన్ని నియోజకవర్గాల్లో అల్ప సంఖ్యాక  వర్గాలుగా ఉండవచ్చు. ఎన్నికైన సభ్యుల సంఖ్య జనాభాలోని వివిధ వర్గాల దామాషాను ప్రతిఫలించే విధంగా ఉండాలి. 

12వ సమావేశం(1896, కలకత్తా): ఈ సమావేశంలో మొదటిసారిగా వందేమాతరం ఆలపించారు. దీనిని దేవేంద్రనాథ్​ ఠాగూర్​ పాడారు. 1906 సెప్టెంబర్​ 7న వందేమాతరం గీతానికి జాతీయ హోదా లభించింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగ పరిషత్​ వందేమాతర గీతాన్ని జాతీయ గేయంగా ఆమోదించింది.

23వ సమావేశం(1907, సూరత్​): ఈ సమావేశంలో ఐఎన్​సీ స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణల విషయంలో భేదాభిప్రాయాల వల్ల అతివాదులు, మితవాదులుగా విడిపోయింది. నాగ్​పూర్​లో నిర్వహించాల్సిన సమావేశం సూరత్​కు మార్చబడింది. ఇక్కడ మితవాద నాయకుల బలం ఎక్కువ. 

26వ సమావేశం (1911, కోల్​కత్తా): ఈ సమావేశంలో మొదటిసారిగా జనగణమన  గీతాన్ని ఆలపించారు. దీనిని రవీంద్రనాథ్​ ఠాగూర్​ 1919 ఫిబ్రవరి 28న మదనపల్లెలో మార్నింగ్​ సాంగ్​ ఆఫ్​ ఇండియా అనే పేరుతో ఇంగ్లీష్​లోకి అనువాదం చేశారు.

44వ సమావేశం(1929 లాహోర్​): ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్​ తీర్మానం ఆమోదించబడింది. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా జవహర్​లాల్​ నెహ్రూ ఎగురవేశాడు.

మొదటి సమావేశం: ఈ సమావేశాన్ని 1885 డిసెంబర్​ 25న పుణెలో జరపాలని నిర్ణయించారు. కాని అక్కడ ప్లేగు వ్యాధి వ్యాప్తి కారణంగా బొంబాయికి మార్చారు. 1885 డిసెంబర్​ 28న తేజ్​పాల్​ సంస్కృత కళాశాలలో గోకుల్​దాస్​ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహించగా కార్యదర్శులుగా ఏఓ హ్యూమ్​, కె.టి.తెలాంగ్​లు పనిచేశారు. ఈ సమావేశానికి 72 మంది సభ్యులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి పి.ఆనందాచార్యులు, గుత్తి కేశవ పిళ్లైలు, హైదరాబాద్​ ప్రాంతం నుంచి అఘోరనాథ ఛటోపాధ్యాయ, రామచంద్రపిళ్లై, ముల్లా అబ్దుల్​ ఖయ్యుంలు హాజరయ్యారు. 

తీర్మానాలు

  •     ఐసీఎస్​ పరీక్షలను ఒకే సమయంలో భారత్, ఇంగ్లాండ్​లో నిర్వహించాలని, పోటీ పరీక్షలకు వయోపరిమితిని పెంచాలని తీర్మానించారు. దీనిని సుబ్రమణ్య అయ్యర్​ ప్రవేశపెట్టారు.
  •     భారతదేశంలోని పరిపాలన గురించి సమీక్ష జరపడానికి ఒక రాయల్​ కమిషన్​ ఏర్పరచడం.
  •     భారత వ్యవహారాల కార్యదర్శి, ఇండియా కౌన్సిల్​ను రద్దు చేయడం.
  •     వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అయోధ్య, పంజాబ్​ల్లో శాసనసభల ఏర్పాటు.
  •     కేంద్ర, ప్రాంతీయ శాసన మండలులలో ఎన్నికైన సభ్యులకు ఇతోధిక దామాషా కల్పించడం.
  •     కామన్స్​ సభలో భారతదేశంలోని శాసనమండలుల నుంచి అధిక్షేపాలను పరిశీలించడానికి ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పరచడం
  •     సైనిక ఖర్చు తగ్గింపు, ఖర్చును భారత్, ఇంగ్లాండ్​లు న్యాయపరమైన నిష్పత్తిలో భరించడం.

ఐఎన్​సీకి అధ్యక్షత  వహించిన ఆంగ్లేయులు

  • 1888    అలహాబాద్    జార్జ్​ యూల్​
  • 1889    బొంబాయి    విలియం వెడ్​బర్న్​
  • 1894    మద్రాస్​    అల్ఫ్రెడ్​ వెబ్​
  • 1904    బొంబాయి    సర్​ హెన్రీ కాటన్​
  • 1910    అలహాబాద్    విలియం వెడ్​బర్న్​
  • ఐఎన్​సీకి మొదట అధ్యక్షత వహించిన వివిధ జాతీయులు
  • 1885    డబ్ల్యూసీ బెనర్జీ       
  • తొలి భారతీయుడు/ హిందువు
  • 1886    దాదాబాయి నౌరోజీ          తొలి పార్శి
  • 1887    బద్రుద్దీన్​ త్యాబ్జి                  తొలి ముస్లిం
  • 1888    జార్జ్​ యూల్​           తొలి ఆంగ్లేయుడు
  • 1891    పి.ఆనందాచార్యులు       తొలి ఆంధ్రుడు
  • 1917    అనిబిసెంట్​              తొలి విదేశీ వనిత
  • 1925    సరోజినీ నాయుడు   తొలి భారతీయ మహిళ

ఐఎన్​సీ సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళల సంఖ్య - 3

  • 1. అనిబిసెంట్​    కలకత్తా(1917)
  • 2. సరోజినీ నాయుడు    కాన్పూర్(1925)
  • 3. నిళినీ సేన్​గుప్తా    కలకత్తా (1933)