- ఐదేండ్ల లోపు పిల్లలందరికీ డ్రాప్స్
హైదరాబాద్ , వెలుగు: అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదేండ్ల లోపు పిల్లలందరికీ ఈ నెల 19న పోలియో చుక్కలు వేయనున్నారు. రాష్ట్రంలో ఐదేండ్లలోపు 38 లక్షల మంది పిల్లలు ఉన్నారని, వాళ్లందరికీ డ్రాప్స్ వేసేందుకు 23,231 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఇమ్యునైజేషన్ ఇంచార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అన్ని హాస్పిటళ్లు, బస్టాండ్లు , మెట్రో, రైల్వే స్టేషన్లలో క్యాంపులు పెడతామని, బస్తీలు, ఇటుక బట్టీల దగ్గరకు వెళ్లి డ్రాప్స్ వేసేందుకు 830 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.ఆ రోజు వేయించుకోని పిల్లలకు ఇంటింటికీ వెళ్లి 20, 21 తేదీల్లో డ్రాప్స్ వేస్తారు . ఇందుకు 46,432 బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
