అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు.. మరోసారి నోటీసులు

అల్లు అర్జున్ ఇంటికి మరోసారి పోలీసులు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం (5 జనవరి 2025) ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు.. మేనేజర్ మూర్తికి నోటీసు అందజేశారు. మొదట నోటీసులు ఎందుకు ఇచ్చారనే విషయంపై వివరణ ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

నోటీసుల ప్రకారం... కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ రావద్దని నోటీసులలో పేర్కొన్నారు. ఒక వేళవస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని హెచ్చరించారు.

అయితే సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం, తీవ్రంగా గాయపడిని శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శ్రీతేజ్ ను పరామ్శిస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. 

అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వస్తే భద్రతా సమస్యలు తలెత్తుతాయని, భారీ ఎత్తున జనం చేరుకునే అవకాశం ఉందని, కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారి ఏదైనా అవాంఛనీయ ఘటన జరగవచ్చునని పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కిమ్స్ కు రావద్దని, వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని పోలీసులు తాజా నోటీసులలో హెచ్చరించారు.