నాంపల్లిలో ఉద్రిక్తత .. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

  • గాంధీభవన్ ముట్టడికి యత్నం
  • ఫ్లెక్సీలు చించేసిన బీజేపీ కార్యకర్తలు
  • లాఠీచార్జి చేసిన పోలీసులు.. ప​లువురి అరెస్ట్
  • ప్రియాంకపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్
  • ఇవాళ ఉదయం బీజేపీ ఆఫీసు వద్ద కాంగ్రెస్ ఆందోళన
  • ఇరు పార్టీల కార్యకర్తల పరస్పర దాడులు 

హైదరాబాద్: నాంపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత  ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేశ్ బిదూరి చేసిన అనుచిత వ్యాఖ్యలు గొడవకు కారణమయ్యాయి. ఇవాళ ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడి చేశారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ ఆఫీసుపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్‌ కార్యకర్తల వెంటపడ్డారు. 

ఈ ఘటనలో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. పోలీసులు భారీగా మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. తమ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిసరాల్లో కట్టిన ఫ్లెక్సీలను చించి నిరసన తెలిపారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.  

ALSO READ | కేటీఆర్ ఓ బచ్చా.. కేసీఆర్ ఒక దుర్మార్గుడు: షబ్బీర్ అలీ ఫైర్

రమేశ్ బిధూరి ఏమన్నారంటే..?

ఈ వివాదానికి ఢిల్లీ బీజేపీ సీనియర్ ఢిల్లీ బీజేపీ సీనియర్‌ నేత రమేష్‌ బిదూరి వయనాడ్ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తున్నారు.  ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక గాంధీపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానంటూ కామెంట్ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.