హైదరాబాద్ కలెక్టరేట్ ఎంట్రెన్స్ లో ఆకట్టుకుంటున్న పోలీసు బొమ్మ..

వెలుగు, హైదరాబాద్​సిటీ:  ట్రాఫిక్​ రూల్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్ ఎంట్రైన్స్​లో  ఏర్పాటు చేసిన పోలీసు బొమ్మ ఆకట్టుకుంటోంది. పక్కనే బోర్డు, నెత్తిన హెల్మెట్ ధరించి ట్రాఫిక్​రూల్స్ ను తెలియజేస్తోంది .