పోలీసులు సెల్ ఫోన్ లాక్కున్నారని.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న బైకర్..

  • సంగారెడ్డిలో వాహనాల చలాన్లు చెక్ చేస్తుండగా ఘటన 
  • బాధితుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు 

సంగారెడ్డిలో ఓ బైకర్  ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాల చలాన్లు చెక్ చేస్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీశాడు. ఇది గమనించిన పోలీసులు ఫోన్ లాక్కోవడంతో బాధితుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ప్రస్తుతం బాదితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.