రాయినిపేట గ్రామంలో .. 41క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

వనపర్తి, వెలుగు : కొత్తకోట మండలం రాయినిపేట గ్రామంలో ఒకరి ఇంట్లో దాచిన 41క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్​ సప్లయ్​ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై మంజునాథ్​రెడ్డి తెలిపారు.   గ్రామంలోని నక్కకుమార్​  ఇంట్లో 72 సంచుల్లో 41 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు , సివిల్​ సప్లయ్​ ఎన్​ఫోర్సుమెంటు అధికారులు ఆయన ఇంటిపై దాడిచేసి,  నిల్వ ఉంచిన రేషన్​ బియ్యాన్ని గుర్తించారు.

తాను రేషను బియ్యాన్ని ఇంటింటికి తిరిగి కిలో రూ.10చొప్పున కొనుగోలు చేసి కర్ణాటక లోని రాయిచూర్​లో  తెలిసిన వారికి కిలో రూ.18కి అమ్మతున్నట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.