సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్య థియేటర్ ఘటనపై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రేపు ( డిసెంబర్ 24, 2024 ) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్బంగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన 4 వారల మద్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఘటనలో రేవతి మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.

ఇటీవల ఈ అంశంపై పెట్టిన ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పోలీసులు వివరణ కోసం నోటీసులు జారీ చేశారా లేక వేరే కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఈ ఘటన సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తానూ అధికారంలో ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీలో సంచనలన నిర్ణయాన్ని ప్రకటించారు.

Also Read :- పాప్ కార్న్పై 18 శాతం GST.. మీమ్సే మీమ్స్.. నవ్వకుండా ఉండలేరు

ఈ వివాదంపై సప్నదించిన ఏసీపీ విష్ణుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్ హెచ్చరించారు ఏసీపీ . అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు.