ప్రజాస్వామ్యంలో అందరికి సమాన హక్కులు ఉండాలన్నారు ఈటల రాజేందర్. జనగామలో టిఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లేందుకు వీలు లేకుండా ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఈటల ఫైర్ అయ్యారు. ధర్నాలు, నిరసనలు చేయడానికి టీఆర్ఎస్ కు మాత్రమే అనుమతులుంటాయా? అని ప్రశ్నించారు. దాడులు తమ కార్యకర్తలపై జరిగితే పోలీసులు అధికార పార్టీవైపు నిలుస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన వారిని వదిలేసి దాడికి గురైన బీజేపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడం ధ్వంద నీతికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు.
