న్యూ ఇయర్​ కిక్కు దిగింది ! ..గ్రేటర్‌‌‌‌లో 2, 864  డ్రంకన్ డ్రైవ్ కేసులు

  • 2434 బైక్స్.. 330 కార్లు.92 ఆటోలు సీజ్‌‌  
  • 1, 406 కేసులు నమోదు
  • డ్రగ్‌‌ టెస్ట్ లో పట్టుబడ్డ ఐదుగురు  
  • కౌన్సెలింగ్  సెషన్స్‌‌ షురూ 


హైదరాబాద్,వెలుగు: ఇయర్​ ఎండింగ్​ రోజు రాత్రి ట్రై కమిషనరేట్ల పరిధిలో తాగి వాహనాలు నడపకుండా పోలీసులు నిర్వహించిన స్పెషల్​ డ్రైవ్​సత్ఫలితాలనిచ్చింది. డిసెంబర్​31న రాత్రి స్పెషల్​ డ్రైవ్​ పెడతామని, దొరికితే కఠిన చర్యలుంటాయని ప్రచారం చేయడం, ఎప్పటికప్పుడు వీకెండ్స్​లో రెగ్యులర్​గా డ్రైవ్​లు నిర్వహించడంతో గతంతో పోలిస్తే ఈసారి తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి.

మంగళవారం రాత్రి 8 గంటల నుంచే రోడ్లపైకి వచ్చిన పోలీసులు బుధవారం ఉదయం 5 గంటల వరకు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మూడు కమిషనరేట్ల పరిధిలో 2,864 మంది చిక్కారు. పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేశారు. గురువారం నుంచి కౌన్సిలింగ్ సెషన్స్‌‌ నిర్వహించి తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు.  

తనిఖీల్లో 4,500 మంది పోలీసులు 

మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 4,500 మంది పోలీసులు స్పెషల్ ​డ్రైవ్​లో పాల్గొన్నారు. ఒక్కో చెక్‌‌ పాయింట్‌‌ వద్ద ఎస్‌‌ఐ సహా10 మంది ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. 550కి పైగా బ్రీత్‌‌ ఎనలైజర్స్‌‌ ఉపయోగించారు. హైదరాబాద్​, సైబరాబాద్‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 2023 డిసెంబర్‌‌‌‌ 31న 3001 కేసులు నమోదు కాగా మంగళవారం 2,864 కేసులు మాత్రమే నమోదయ్యాయి.  

500 బీఏసీ కంటే ఎక్కువచ్చినోళ్లు 10 మంది 

సైబరాబాద్‌‌ కమిషనరేట్ పరిధిలో నలుగురికి 500 బీఏసీ లెవెల్​ కంటే ఎక్కువ రాగా, రాచకొండ పరిధిలో ఒకరికి అత్యధికంగా 348 బీఏసీ వచ్చింది. డ్రంకెన్ డ్రైవ్‌‌లో దొరికిన వారి వాహనాలను సీజ్ చేసి ఆర్‌‌‌‌సీ, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం, బ్రీత్​ఎనలైజర్​తో పాటు మందు తాగి వాహనాలు నడిపిన వారి ఫొటోలు తీసుకున్నారు. సీజ్ చేసిన వెహికిల్స్‌‌ను ఆయా పోలీస్‌‌ స్టేషన్లకు తరలించారు.

డ్రైవర్లకు గోషామహల్‌‌, బేగంపేట్‌‌, ఎల్బీనగర్‌‌‌‌, మాదాపూర్‌‌‌‌లోని సెంటర్స్‌‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. సిటీ కమిషనరేట్‌‌లో పట్టుబడిన 401 మందికి వారి వారి కుటుంబసభ్యులతో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల గురించి15 నిమిషాల వీడియోను ప్రదర్శించారు. షెడ్యూల్ ప్రకారం సంబంధిత కోర్టుల్లో హాజరుకావాలని సమాచారం ఇచ్చారు.

డ్రగ్స్​, గంజాయి తీసుకున్న ఐదుగురికి పాజిటివ్​ 

మరోవైపు టీజీ న్యాబ్‌‌ పోలీసులు డ్రగ్స్‌‌ డిటెక్షన్‌‌ తనిఖీ లు నిర్వహించారు. పబ్స్‌‌, బార్లు,ఈవెంట్స్‌‌ ఎక్కువగా జరిగిన 52 ప్రాంతాల్లో అనుమానితులను గుర్తించి టెస్ట్‌‌ చేయగా ఐదుగురికి పాజిటివ్​వచ్చింది. మూడు కమిషనరేట్ల పరిధిలో నాలుగు టీజీ న్యాబ్ టాస్క్​ఫోర్స్​టీమ్స్, 21 ఇతర బృందాలు కలిసి నార్కొటిక్స్ డాగ్‌‌ స్క్వాడ్‌‌తో పాటు అడ్వాన్సుడ్​ డ్రగ్‌‌ డిటెక్షన్‌‌ కిట్స్‌‌తో టెస్టులు చేశారు.  

కమిషనరేట్     బైక్స్     కార్లు     ఆటోలు     భారీ  వాహనాలు        మొత్తం కేసులు
                  
హైదరాబాద్    1223     135        48     0             1,406
సైబరాబాద్    685    131    18    5              839
రాచకొండ    526    64    26    3              619
మొత్తం         2434    330    92    8              2,864