విజయవాడ: విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ డ్యామేజ్ అయింది. ఫ్లైఓవర్ నుంచి కాంక్రీట్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ కింద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్కు గాయాలు అయ్యాయి. APSP బెట్టాలియన్ కి చెందిన రాంబాబు దసరా ఉత్సవాల సందర్భంగా ఫ్లైఓవర్ కింద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఫ్లై ఓవర్ కాంక్రీట్ పెచ్చులు పడటంతో అతని చేతికి, భుజానికి గాయాలయ్యాయి. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ఫ్లై ఓవర్ నిర్మాణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
