హైద్రాబాద్లో న్యూ ఇయర్ కౌంట్డౌన్ స్టార్ట్.. ఈ విషయాలు మైండ్లో ఉంచుకోండి

హైద్రాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల సందడి మొదలైంది. బ్యాచ్ లర్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్.. ఆఫీస్ ఫ్రెండ్స్.. ఇలా గ్యాదరింగ్స్ జరిగిపోతున్నాయి. ముందు ముందుగానే మందు, ముక్క రెడీ చేసుకుంటున్నారు హైదరాబాదీలు. పాత ఏడాదికి వీడ్కోలు  చెప్పి కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫుల్ జోష్ లో ఎదురు చూస్తున్నారు. 

న్యూ ఇయర్ సందర్భంగా తెగ ఎంజాయ్ చేయాలనుకునే వారు కొన్ని రూల్స్ గుర్తించుకోవాల్సి ఉంది. అదే విధంగా నగరంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ కూడా మైండ్ లో ఉంచుకోవాలి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా పెద్ద పరిమారం చెల్లించుకోవాల్సి వస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు చెప్పిన ఈ కింది నిబంధనలు, సమాచారాన్ని దృష్టిలో ఉంచుకోండి:

  • యాక్సిడెంట్ ఫ్రీ.. ఇన్సిడెంట్ ఫ్రీ గా వేడుకలు చేసుకోవాలి
  • ఈవెంట్స్ లో డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్
  • బ్రీత్‌ ఎనలైజర్స్, డ్రగ్‌ డిటెక్షన్ టెస్ట్‌ కిట్స్‌తో చెకింగ్‌
  • రాత్రి 9 గంటల నుంచే డ్రంకన్‌ డ్రైవ్, డ్రగ్స్‌ టెస్టులు
  • పోలీసులు, టీ న్యాబ్‌ జాయింట్ ఆపరేషన్స్
  • 8 గంటల తర్వాత ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్స్‌ చుట్టూ నో ఎంట్రీ, ట్రాఫిక్ డైవర్షన్స్‌
  • గ్రేటర్‌‌ లో 280 చెక్‌పోస్ట్‌లు,120 డ్రగ్‌ డిటెక్షన్ కిట్స్‌
  • ఫ్లై ఓవర్స్‌, ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్స్, ORR, PV ఎక్స్‌ప్రెస్‌ వే క్లోజ్‌
  • ORR పై ఎయిర్‌‌ టికెట్స్‌ ఉన్నవారికే అనుమతి.. ఎంట్రీ ఎగ్జిట్‌లో డ్రంకన్‌ డ్రెవ్‌ టెస్ట్‌లు
  • మొదటిసారి పట్టుబడితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ సస్పెండ్‌
  • రెండోసారి పట్టుబడితే 15 వేలు జరిమాన లేదా 2 ఏండ్లు జైలు శిక్ష
  • ఈవెంట్స్‌ జరిగే ప్రాంతాల్లో పోలీస్ ల కండిషన్స్‌.