ముమ్మరంగా వాహన తనిఖీలు

అలంపూర్, వెలుగు : పార్లమెంట్  ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం రాయచూరు రహదారిపై మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్  వెహికల్స్​ పరిశీలించి పంపించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్  అమలులో ఉన్న కారణంగా ప్రజలు రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తమ వెంట తీసుకెళ్లవద్దని సూచించారు. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే ఆధారాలు వెంట ఉంచుకోవాలన్నారు.