హైదరాబాద్ లో 154 బాటిళ్ల ఎన్డీపీఎల్ మద్యం పట్టివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: మధ్యప్రదేశ్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 154 మద్యం బాటిళ్ల ను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. చెంగిచెర్ల ప్రాంతంలో ఎన్ డీపీ ఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చిందని సమాచారం మేరకు ఎస్టీఎఫ్​ ఎక్సైజ్ సూపరింటెండెంట్​ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. చెంగిచెర్లకు చెందిన తరుణ్ వర్మ పెద్ద మొత్తంలో మద్యం తెచ్చి , డిస్ట్రిబ్యూషన్ చేస్తుండగా.. 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

తరుణ్ వద్ద సమాచారాన్ని సేకరించి మిగితా ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్ లో ఉన్న సురేందర్ రెడ్డి కారులో 70 బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. షేక్ పేటలోని క్రాంతి ఇంట్లో 28 మద్యం పార్టీలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సార్ నగర్ కు చెందిన నాగార్జున వద్ద 16 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను, ఆరు సెల్​ఫోన్ల స్వాధీనం చేసకున్నారు. తరుణ్ వర్మ, రవీందర్ గౌడ్, విన్నీ, కే సురేందర్ రెడ్డి, క్రాంతి, నాగరాజు ను అరెస్ట్ చేశారు.