మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్.. అట్రాసిటీ కేసు నమోదు.. అరెస్టు ఖాయమేనా..

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్ కే రోజాపై కర్నూలులో పోలీసు కేసు నమోదయ్యింది. దళిత సంఘాల ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. రోజా పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో బాపట్లలోని సూర్యలంక బీచ్‌కు పర్యటనలో ఒక దళిత ఉద్యోగితో రోజా చెప్పులు మోయించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై కర్నూలు త్రిటౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అయితే.. పోసాని, శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ సహా పలువురు వైసీపీ కీలక నేతలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాజీ మంత్రి  రోజాపై కేసు నమోదవ్వడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. 

రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2023 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్‌ను సందర్శించారు. టూరిజం రిసార్ట్స్‌ నుండి బీచ్ కి వెళ్లిన రోజా... సముద్రంలోకి దిగే సమయంలో ఒడ్డున చెప్పులు విడిచి వాటిని జాగ్రత్తగా చూడాలంటూ సిబ్బందిని ఆదేశించారు.ఈ క్రమంలో  పర్యాటక శాఖకు చెందిన ఉద్యోగి ఒకరు రోజా చెప్పులను కొద్దిసేపు మోశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.