లింగాలలో బెల్ట్​ షాపులపై పోలీసులు దాడి

లింగాల, వెలుగు: అక్రమంగా మద్యం అమ్మితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని లింగాల ఎస్ఐ జగన్మోహన్  హెచ్చరించారు. మండలంలోని అప్పాయిపల్లి, రాంపూర్ గ్రామాల్లోని కిరాణ షాపులను తనిఖీ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న భాను ప్రకాష్, శ్రీకాంత్, చంద్రశేఖర్ లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇద్దరిపై కేసు నమోదు..

కోడేరు: పెద్దకొత్త పల్లి మండలం పెద్దకారుపాముల గ్రామంలో బుధవారం కొల్లాపూర్  ఎక్సైజ్  సీఐ నాగిరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఆరు లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని, ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సారా అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్  సీఐ కల్యాణ్, ఎస్ఐ కృష్ణ పాల్గొన్నారు.