ఓయో రూమ్స్లో పేకాట రాయుళ్ల అరెస్టు.. భారీగా నగదు స్వాధీనం

హైద్రాబాద్ ఓయో రూమ్స్ లో పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు పోలీసులు. కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట రాయుళ్లు అరెస్ట్ చేసిన పోలీసులు భారీగా నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అడ్డగుట్టలోని ఎన్ గ్రాండ్ ఓయో రూమ్స్ లో పెద్ద మొత్తంతో పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. 

ఏడు మంది పేకాట రాయుళ్లను SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 1 లక్షా 78 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఏడు సెల్ ఫోన్లు,  ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.