డబ్బుకు బదులుగా ఫోన్ ఇచ్చి.. గంజాయి విక్రయం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మొయినాబాద్ పరిధిలో గంజాయిని పట్టుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. తోల్కట్ట గ్రామ శివారులోని ఒక షెడ్డులో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 580 గ్రాముల గంజాయి, 92 గంజాయి చాక్లెట్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బిహార్ కు చెందిన సౌరబ్ కుమార్ గా గుర్తించారు. 

అదే సమయంలో పాత నేరస్తుడైన ముజ్తాబా అలీ ఖాన్ (హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని 10 కేసులలో సెల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడిన నిందితుడు) గంజాయిని కొనటానికి 2 చోట్ల  దొంగతనం చేసిన ఫోన్లతో పట్టుబడటం జరిగింది. ఇతను డబ్బులకు బదులుగా ఫోన్ లను ఇచ్చి గంజాయి తీసుకోవడం విశేషం.