సీఎంఆర్ కాలేజీ ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్

  • కాలేజీ చైర్మన్, డైరెక్టర్,  ప్రిన్సిపాల్ పై కేసు

మేడ్చల్, వెలుగు: సీఎంఆర్  కాలేజీ ఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాలేజీలో చోటుచేసుకున్న సంఘటన యావత్  రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాలికల హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టడంపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బిహార్ కు చెందిన ఇద్దరు నిందితులు కిశోర్, గోవింద్ తో పాటు మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసి ఆదివారం రిమాండ్ కు తరలించారు.

 కాలేజీ చైర్మన్  గోపాల్  రెడ్డి, డైరెక్టర్ జంగారెడ్డి, ప్రిన్సిపల్  సత్యనారాయణ, వార్డెన్  ప్రీతిరెడ్డి, క్యాంపస్  వార్డెన్  ధనలక్ష్మిపై కేసు నమోదు చేశామని మేడ్చల్  పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ వేగవంతం చేసి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.