Geetanjali Death: గీతాంజలి మరణం కేసులో టీడీపీ కార్యకర్త అరెస్ట్

తెనాలి మహిళ గీతాంజలి మరణం ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గీతాంజలి మరణానికి మీరంటే మీరు కారణం అంటూ అధికార ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి. టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి మరణించిందంటూ అధికార వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్త రాంబాబును అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.

రాంబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వైసీపీ మీద వివాదాస్పద పోస్టులు షేర్ చేసే రాంబాబు  గీతాంజలి మీద కూడా అసభ్యకర పోస్టులు షేర్ చేశాడు. రాంబాబును అరెస్ట్ చేసిన పోలీసులు అతను టీడీపీ నేత బోండా ఉమా వంటి చాలామంది నాయకులతో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. జగన్ సర్కార్ నుండి ఇళ్ల పట్టా అందుకున్న ఆనందంలో తన కుటుంబానికి అందిన సంక్షేమ పథకాల గురించి చెబుతూ మీడియాతో తన  సంతోషాన్ని పంచుకున్న గీతాంజలి మీద సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.