సీఎంఆర్ కాలేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..

సీఎంఆర్ కాలేజీ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యార్థునుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా హాస్టల్ బాత్ రూముల్లో తొంగిచూసినందుకు గాను బీహార్ కి చెందిన కిశోర్‌, గోవింద్‌ లను ఆదివారం ( జనవరి 5, 2025 ) అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఇద్దరితో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. కాలేజీ చైర్మన్‌ చామకూరు గోపాల్‌రెడ్డి,కాలేజీ డైరెక్టర్‌ జంగారెడ్డి, ప్రిన్సిపాల్‌ అనంతనారాయణ, వార్డెన్‌ ప్రీతిరెడ్డి, క్యాంపస్‌ వార్డెన్‌ ధనలక్ష్మిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

తమను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిశోర్‌, గోవింద్‌ లపై ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థునులు ఆరోపిస్తున్నారు.సీఎంఆర్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్ రూమ్‎లో విద్యార్థినుల నగ్న వీడియోలు చిత్రీకరణ ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. బాత్ రూమ్‎లో ఫోన్ పెట్టి తమ ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశారంటూ విద్యార్థినులు రోడ్డెక్కడంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్‎గా తీసుకున్నారు.

ఈ కేసు విచారణలో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేసిన పోలీసులు బుధవారం (జనవరి 1, 2025) కుకింగ్ డిపార్ట్మెంట్‎లోని ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..గురువారం (జనవరి 2,2025 ) మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.