లగచర్ల కేసులో కీలకంగా టెక్నికల్ ఎవిడెన్స్​

  • దాడికి ముందు కేటీఆర్​ను కలిసిన పట్నం నరేందర్​రెడ్డి, సురేశ్! 
  • అక్టోబర్‌‌‌‌ 25న నందినగర్‌‌‌‌లోని కేటీఆర్‌‌‌‌ ఇంట్లో టవర్ లొకేషన్స్!

హైదరాబాద్‌‌,వెలుగు: లగచర్ల కేసులో పోలీసులు టెక్నికల్ ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి, రెండో నిందితుడు భోగమోని సురేశ్‌‌ ఉపయోగించిన ఫోన్ నంబర్స్‌‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడికి వారం రోజుల ముందు వారు ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అనే వివరాలు రాబడుతున్నారు. ఇందులో భాగంగా ఇద్దరి సెల్‌‌ టవర్‌‌‌‌ లొకేషన్స్‌‌ను సేకరించారు. వీరిద్దరు అక్టోబర్‌‌‌‌ 25న జూబ్లీహిల్స్‌‌ నందినగర్‌‌‌‌లోని కేటీఆర్ ఇంటి వద్ద ఉన్నట్టు గుర్తించారు. 

ఈ క్రమంలోనే వీరిద్దరి సెల్‌‌ఫోన్స్‌‌ డేటాను రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు. నరేందర్‌‌‌‌రెడ్డి తన సెల్‌‌ఫోన్‌‌ పాస్‌‌వర్డ్‌‌ను చెప్పించేందుకు కోర్టును ఆశ్రయించనున్నారు. సురేశ్​ కాల్‌‌డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వికారాబాద్‌‌ జిల్లా లగచర్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీ కారిడార్‌‌‌‌ కోసం నిరుడు నవంబర్‌‌‌‌‌‌11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అదేరోజు జిల్లా కలెక్టర్‌‌‌‌ ప్రతీక్‌‌ జైన్‌‌సహా స్థానిక అధికారులపై దాడి జరిగింది. ఈ కేసులో పూర్తిగా సాంకేతిక ఆధారాలపైనే పోలీసులు దృష్టి సారించారు.

సెల్‌‌ఫోన్‌‌ టవర్‌‌‌‌ లొకేషన్స్‌‌తో కదలికలు

పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి సహా నిందితులు ఇచ్చిన స్టేట్‌‌మెంట్స్‌‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సాంకేతిక ఆధారాలపై ఫోకస్‌‌ పెట్టారు. ఇందులో భాగంగా నిందితుల సెల్‌‌ఫోన్‌‌ టవర్‌‌‌‌ లొకేషన్స్‌‌ డేటాను ఆయా సర్వీస్ ప్రొవైడర్స్‌‌ నుంచి సేకరించారు. 

అక్టోబర్‌‌‌‌ 25న  కొడంగల్‌‌కు చెందిన పలువురు బీఎస్పీ కార్యకర్తలు బీఆర్ఎస్‌‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌‌తో పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి భేటీ అయినట్టు పోలీసులు గుర్తించారు. వీటిని నిరూపించేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి,సురేశ్‌‌ కాల్‌‌డేటా,సెల్‌‌ఫోన్‌‌ టవర్ లొకేషన్స్‌‌ ఆధారంగా వారి కదళికలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్తులను రెచ్చగొట్టే విధంగా పట్నం నరేందర్‌‌‌‌ రెడ్డి చేసిన స్పీచ్‌‌లకు సంబంధించిన వీడియో రికార్డింగ్స్ సేకరించారు.

మిస్టరీగా సెల్‌‌ఫోన్స్‌‌ డేటా

పోలీసుల దర్యాప్తులో సెల్‌‌ఫోన్స్‌‌ మిస్టరీగా మిగిలాయి. పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి, సురేశ్​ సెల్‌‌ఫోన్స్‌‌లో కీలక విషయాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకే నిందితులు ప్లాన్‌‌ చేసుకున్నట్టు భావిస్తున్నారు. దీంతో పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి ఐ ఫోన్‌‌ను ఎలాగైనా సరే  ఓపెన్ చేసేందుకు యత్నిస్తున్నారు. 

పాస్‌‌వర్డ్‌‌ చెప్పకపోవడంతో కోర్టును ఆశ్రయించనున్నారు. కోర్టు ఆదేశాలతో ఫోన్‌‌ ఓపెన్‌‌ చేసి డేటాను రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా, సురేశ్‌‌ తన సెల్‌‌ఫోన్‌‌ పగులగొట్టి లారీ లో వేశానని చెప్పాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి సెల్‌‌ఫోన్స్‌‌లో మిస్టరీ ఏముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.