సీఎం జగన్ పై జరిగిన రాళ్ళ దాడి రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన కారణంగా అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్దానికి దారి తీసింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పొలిసు శాఖ శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. ప్రత్యేక బృందాలతో టెక్నాలజీని దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. జగన్ పై దాడి చేసిన ఆగంతకులు ఎవరు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు.
జగన్ పై దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు. అయితే, ప్రస్తుతం విజయవాడకు చెందిన నలుగురు రౌడీషీటర్లను అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. మరి, జగన్ పై దాడి చేసింది ఆ రౌడీ షీటర్లలో ఒకరా లేక ఇతరులా అన్నది తేలాలంటే వేచి చూడాలి