రూ.5.45 కోట్లతో పోచారం అభివృద్ధి..కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం

ఘట్​కేసర్, వెలుగు: పోచారం మున్సిపాలిటీలో రూ.5.45 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత ఇటీవల మృతి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ బైరా హిమకు సభ నివాళి అర్పించింది.

అనంతరం రిపేర్లు, పారిశుధ్య సిబ్బంది పనిముట్లు, సామగ్రి కొనుగోలు, స్వచ్ఛ సర్వేక్షన్, విలీన గ్రామాల సిబ్బంది జీతాలతోపాటు పలు పనులకు రూ. 5.45 కోట్లను కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. యంనంపేటలోని శ్రీనిధి కాలేజీ, రాక్ ఉడ్ స్కూల్ టాక్స్ రీ అసెస్మెంట్ చేయాలని తీర్మానించారు.