పీఎంసీ బ్యాంక్ మనీ ల్యాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో మహిళల్ని లక్ష్యంగా చేసుకోవడం పిరికి చర్య. మేం ఎవరికి భయపడం. అయినా ఈడీ అధికారులకు కావాల్సిన సంబంధిత డాక్యుమెంట్లు సమ్మిట్ చేసినట్లు చెప్పారు.
గతేడాది శరద్ పవార్, ఏక్ నాతథ్ కాదేస్, ప్రతాప్ సర్ నాయక్ లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పడు నాకు నోటీసులు అందడంతో మీరు నాగురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలే ముఖ్యం. ఇవన్ని కాగితం ముక్కలే. అంతకు మించి ఏమీలేదన్నారు.
రెండురోజుల క్రితం మహరాష్ట్రహోం మినిష్టర్ అనీల్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన చట్టాల్ని వ్యతిరేకించిన వారిపై బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. మహరాష్ట్రలో రాజకీయ లబ్ధి కోసమే ఈడీ అధికారులు వినియోగిస్తున్నట్లు తాను గతంలో ఎక్కడా చూడలేదన్నారు. అందుకే తాము ప్రభుత్వ అనుమతులు లేకుండా సీబీఐ అధికారులు దర్యాప్తు చేసే వీలులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్ కు ఈడీ అధికారులు నోటీసు ఇవ్వడంపై మహరాష్ట్ర మినిస్టర్ ఆధిత్యా ఠాక్రే స్పందించారు. రాజకీయలబ్ధి కోసమే బీజేపీ సీబీఐ అధికారుల్ని అస్త్రంగా వినియోగించుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు ఎన్ని తలెత్తినా మహరాష్ట్రలో మహా వికాస్ అగాడి (ఎంవీఏ) ప్రభుత్వం దృఢంగా ఉంటుందని చెప్పారు.
కాగా డిసెంబర్ 29న వర్షా రౌత్ ఈడీ అధికారుల నోటీసులపై ముంబైలోని ఫెడరల్ ఏజెన్సీ అధికారుల్ని సంప్రదించనున్నారు. వర్షా – ప్రవీణ్ రౌత్ ల మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలపై ఈడీ అధికారుల విచారణ ఎవరి ఒత్తిడితో జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.
