దేశంలో తొలిసారి పట్టాలెక్కిన డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్

దేశంలో తొలిసారి పట్టాలెక్కిన డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్
దేశంలోనే తొలిసారి డ్రైవర్ లేని మెట్రో రైలు పట్టాలెక్కింది.  ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ట్రైన్ ను ప్రారంభించారు. పశ్చిమ జనక్ పురి నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య 37 కి.మీ మ్యాజెంటా లైన్ ఉంది. ఈ సందర్బంగా మాట్లాడిన ప్రధాని మోడీ..భారత్ స్మార్ట్ సిస్టమ్ వైపు వెళ్తోందన్నారు. వాజ్ పేయి వల్లేదేశంలో మెట్రో మొదలైందన్నారు. 2014 కు ముందు మెట్రోపై విధానమంటూ లేదన్నారు.నగరీకరణను అవసరంగా గుర్తిస్తున్నామన్నారు. 2014 వరకు దేశంలో 5 సిటీల్లోనే  248 కి.మీ మెట్రో అందుబాటులో ఉందన్నారు. ఇపుడు 18 సిటీల్లో 700 కి.మీ పైగా మెట్రో అందుబాటులో ఉందన్నారు. 2025 వరకు 25 సిటీల్లో 1700 కి.మీకు విస్తరిస్తామన్నారు. డ్రైవర్ లెస్ మెట్రో  ఖర్చును తగ్గిస్తుందన్నారు.  విదేశీ కరెన్సీని ఆదా చేస్తుందన్నారు. దేశ ప్రజలకు ఎక్కువ ఉపాధిని అందిస్తుందన్నారు మోడీ.     The inauguration of the first driverless metro train shows how fast India is moving towards smart systems: PM Narendra Modi https://t.co/CYlAJfMTUZ pic.twitter.com/G3LnmJuYyh — ANI (@ANI) December 28, 2020