అసంతృప్తి వ్యక్తం చేసే వారి నుంచి మోడీ ఎప్పుడూ పారిపోలేదు

అసంతృప్తి వ్యక్తం చేసే వారి నుంచి మోడీ ఎప్పుడూ పారిపోలేదు

కరోనా సంక్షోభ సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు నడిపించారని ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ప్రశంసల వర్షం కురిపించారు.  అసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడిన రతన్ టాటా..,  నరేంద్ర మోడీకి బాహ్య సౌందర్యాన్ని ప్రదర్శించే పైపై మెరుగులు లేవని, షో మ్యాన్ అంతకంటే కాదని రతన్ టాటా అభిప్రాయం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ పై వ్యతిరేకత ఉన్న, కొన్ని వర్గాలలో అసంతృప్తి ఉన్న ఎప్పుడు వెనక్కి తగ్గలేదని, పారి పోలేదని వ్యాఖ్యానించారు.  దేశంలోని పేదలకు ఉచిత ఆహారం మరియు ఉపాధి కల్పించడానికి ఆర్థిక సహాయాన్ని పెంచేటప్పుడు వృద్ధిని పెంచడానికి క్రెడిట్ మద్దతును పెంచడానికి భారత ప్రభుత్వం భారీ ద్రవ్య మద్దతుతో సహా అనేక చర్యలు తీసుకుందని రతన్ టాటా అభిప్రాయపడ్డారు.