ప్రధాని మోడీ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మోడీ మీదున్న అభిమానంతో పలుచోట్ల రక్తదానం, అన్నదానం, అనాద ఆశ్రమాలల్లో పండ్లు, బట్టలు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల మొక్కలు నాటి అభిమానం చాటుకున్నారు అభిమానులు. అయితే.. గుజరాత్ లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ 70వ పుట్టినరోజు సందర్భంగా ‘కరోనా యోధులు’ అనే థీమ్‌తో 771 కిలోగ్రాములు, 71 అడుగుల పొడవైన కేక్‌ను తయారు చేశారు. గుజరాత్ సూరత్‌లోని బ్రెడ్‌లైనర్ బేకరీ యాజమాన్యం ఈ కేక్ ను తయారుచేయటమేకాక.. డిజిటిల్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంటే కేక్ కటింగ్ వేడుక డిజిటల్‌లో జరుగుతుంది అన్నమాట.
ఈ విధంగా చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. మూడేండ్లుగా మోడీ పుట్టినరోజును బ్రెడ్‌లైనర్ బేకరీతోపాటు, సామాజిక అవగాహన కార్యక్రమంతో జరుపుకున్నామని కార్యక్రమ నిర్వాహకుడు నితిన్ పటేల్ తెలిపారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కేక్‌ను ‘కరోనా యోధులకు కేక్’ అనే లేబుల్ చేశామన్నారు. కరోనా రూల్స్ పాటిస్తూ కార్యక్రమంలో ఏడుగురు కరోనా యోధులు పాల్గొన్నారు. కేక్ మీద కరోనా యోధుల ఫొటోలు ఉన్నాయి. పోలీసులు, ప్లాస్మాదాతలు, డాక్టర్లు, కార్మికులు, మీడియాకు సంబంధించినవారున్నారు. కేక్‌ను కట్ చేసిన తర్వాత మొదట పిల్లలకు పంపిణీ చేసి, తర్వాత ఒక్కొక్కటి 500 గ్రా. చొప్పున వాపి నుంచి వడోదర వరకు ఉన్న అన్ని బేకరీ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపింది బేకరీ యాజమాన్యం.
71 feet long Cake made form Bread liner group in Surat on Modiji's birthday and dedicated for Corona Worriers… ?? pic.twitter.com/OENuVv8zEF
— Fr Darshan Naik (@darshan2866) September 17, 2020
