ప్రధాని మోడీ ట్వీట్.. ఇస్రోకు నా శుభాకాంక్షలు..

ప్రధాని మోడీ ట్వీట్.. ఇస్రోకు నా శుభాకాంక్షలు..

 ఇండియన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్ (ఇస్రో) పై ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని నింగిలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇది అంతరిక్ష రంగంలో భారతదేశ పరాక్రమాన్ని పెంచుతుందని అన్నారు. "మా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు 2024కి గొప్ప ప్రారంభం! ఈ ప్రయోగం అంతరిక్ష రంగానికి అద్భుతమైన వార్త మరియు ఈ రంగంలో భారతదేశం యొక్క నైపుణ్యాన్ని పెంచుతుంది. భారతదేశాన్ని అపూర్వమైన ఎత్తుకు తీసుకెళ్లిన ఇస్రోలోని మా శాస్త్రవేత్తలకు మరియు మొత్తం అంతరిక్ష సోదరులకు శుభాకాంక్షలు" అని మోడీ ట్వీట్ లో తెలిపారు.

 కాగా, ఇస్రో సోమవారం ఉదయం 9గంటల 10 నిమిషాలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV C58) మిషన్‌లో, ప్రాథమికమైన ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహన్ని నింగిలోకి విజయవంతంగా పంపింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలలిసిందే.