2024 తర్వాత మోదీ.. దుబాయ్ పారిపోతారు : పంచ్ పేల్చిన లాలూ

2024 తర్వాత మోదీ.. దుబాయ్ పారిపోతారు : పంచ్ పేల్చిన లాలూ

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామని, మోదీ ఇప్పట్నుంచే విదేశాల్లో ఆశ్రయం కోసం వెతుకుతున్నారని, అందుకే ఆందోళన చెందుతున్నారని రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త కూటమి ‘ఇండియా’ను ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా లాలూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 'మోదీ తప్పుకోవాలని మేం ప్లాన్‌ చేస్తున్నారంటే.. ఆయన ఇన్ని దేశాలు సందర్శిస్తున్నారని.. పిజ్జాలు, మోమోలు, చౌమీన్‌లను ఆస్వాదించగలగడం కోసం వెతుకుతున్నారు' అని ఆయన అన్నారు.

వచ్చే నెలలో ముంబైలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి హాజరు కానున్నట్టు ఈ సందర్భంగా లాలూ స్పష్టం చేశారు. మణిపూర్ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలన్న ఆయన.. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రయత్నాలను ఇండియా కూటమి తిప్పికొడుతుందని చెప్పారు. దేశ ఐక్యతను కాపాడేందుకు బీజేపీని ఓడించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.