మాటలు సరిపోవు..యడ్యూరప్పకు మోడీ ప్రశంసలు

మాటలు సరిపోవు..యడ్యూరప్పకు మోడీ ప్రశంసలు

కర్ణాటక అభివృద్ధికి, బీజేపీకి యడ్యుూరప్ప చేసిన  సేవలకు మాటలు సరిపోవన్నారు ప్రధాని మోడీ. దశాబ్ధాలుగా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజలతో మమేకమయ్యారని గుర్తు చేశారు. ప్రజ సంక్షేమం పట్ల యడ్యూరప్ప నిబద్ధత కలిగి ఉన్న నేత అన్నారు మోడీ. కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప సోమవారం రాజీనామా చేశారు. కొత్త సీఎంగా యడ్యూరప్ప సామాజిక వర్గానికే చెందిన బస్వరాజ్ బొమ్మైను నియమించారు.  అలాగే కర్ణాటక కొత్త సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బొమ్మైకి అభినందనలు తెలిపారు. ఆయన రాష్ట్రాన్ని పాలన పరంగా,  అభివృద్ధి పరంగా ముందుకు నడిపిస్తారనే నమ్మకం తనకుందన్నారు.