కాంగ్రెస్ దుష్ఠపాలనలో తెలంగాణ : ప్రధాని మోదీ

కాంగ్రెస్ దుష్ఠపాలనలో తెలంగాణ రాష్ట్రం బంధి అయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. మార్చి 16వ తేదీ శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలో బీజేపీ వియజ సంకల్ప యాత్రలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

మోదీ కీలక వ్యాఖ్యలు

  •  గత పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే జరిగింది. 
  •  తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తోంది.. ఇక్కడ బీజేపీ విజయం సాధిస్తుంది.
  • నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మండంగా జరిగింది.
  • ఈరోజు ఎంపీ ఎన్నికల హెడ్యూల్ రాబోతోంది.
  • మూడోసారి కూడా మోదీ సర్కారే వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.
  • ఎన్నికల కోడ్ రాకముందే బీజేపీని గెలిపించాలని దేశ ప్రజలు డిసైడ్ అయ్యారు.
  •  దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తోంది.. దేశ ప్రజల మనస్సుల్లో బీజేపీ ఉంది.
  • మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
  • దేశ ప్రజలు మళ్లీ నన్ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.
  • దేశంలో 400 సీట్లు గెలువడమే మా లక్ష్యం.
  • మా ప్రభుత్వం వస్తేనే.. దేశం మరింత  అభివృద్ధి సాధిస్తుంది