న్యూఢిల్లీ: శ్రీకృష్ణుని బోధనలను విశ్వవ్యాప్తంగా బోధించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) వ్యవస్థాపకులు శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద జ్ఞాపకార్థం భారత ప్రధాని నరేంద్ర మోడీ స్మారక నాణేన్ని బుధవారం విడుదల చేశారు. శ్రీ ప్రభుపాద స్వామి 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తూ స్మారక నాణేన్ని విడుదల చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.
ఇస్కాన్ ప్రముఖుతో వర్చువల్ గా జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. స్వామి శ్రీల ప్రభుపాద 125 వ జయంతి గురించి ప్రస్తావిస్తూ.. ఆజాది కా అమృత్ మహోత్సవ్ జరుగుతున్న వేళ శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద సమాజానికి చేసిన సేవలను, బోధనలతో ఎంతో మందిని ప్రభావితం చేసి శాంతియుత సమాజం ఏర్పాటుకు పాటుపడ్డారని కొనియాడారు.
