ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రహస్య ఎజెండా ఉందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. 2024 ఎన్నికలకు ముందే వీరిద్దరి మధ్య రహస్య సమావేశాలు జరుగుతాయని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చర్చించుకోవడానికే ఇవి ఉపయోగపడతాయన్నారు. పీఎం మోడీ, దీదీ కలిసి కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటున్నారన్నారు. దీదీ డార్జిలింగ్‌లో గవర్నర్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో కూర్చుని టీ తాగారని చెప్పారు. మమతా బెనర్జీ డార్జిలింగ్‌లోని రాజ్‌భవన్‌లో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్‌ను పరామర్శించారు. దీనికి హిమంత బిశ్వ శర్మ కూడా హాజరయ్యారన్నారు. బీజేపీకి మెజార్టీ ఉందని ఏదైనా చేయవచ్చనే అభిప్రాయంతో మోడీ ఉన్నారన్నారు.
