సహజ వనరులు శాశ్వతం కాదన్నారు ప్రధాని మోడీ. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలపై కేంద్రం దృష్టి పెడుతోందన్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు లైఫ్ స్టయిల్ లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు మోడీ. ఈ మార్పులన్నింటి మధ్య పర్యావరణాన్ని కాపాడుకోడం కూడా ముఖ్యమన్నారు. గుజరాత్ లో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్ లో నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీని ప్రారంభించారు మోడీ. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
