హంపి స్పోర్టింగ్‌‌ ఐకాన్‌: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: తెలుగు గ్రాండ్‌‌ మాస్టర్‌‌ కోనేరు హంపి.. స్పోర్టింగ్‌‌ ఐకాన్‌‌ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఇటీవల ఫిడే విమెన్స్‌‌ వరల్డ్‌‌ ర్యాపిడ్‌‌ టైటిల్‌‌ నెగ్గిన హంపి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి పీఎంను కలిసింది. ఈ సందర్భంగా హంపిని మోదీ అభినందించారు. ‘హంపితో పాటు ఆమె  ఫ్యామిలీని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె తెలివి తేటలు, ధృడ సంకల్పం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియాకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టడంతో పాటు మరోసారి ఆటలో పదును తగ్గలేదని నిరూపించింది’ అని మోదీ ఎక్స్‌‌లో ట్వీట్‌‌ చేశారు. మరోవైపు పీఎంని తన కుటుంబంతో కలిసి కలుసుకోవడం జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అరుదైన సందర్భమని హంపి ట్వీట్ చేసింది.