రైతులకు గుడ్ న్యూస్ : పీఎం కిసాన్ డబ్బులు రూ. 6 వేలు కాదు.. ఇక నుంచి 10 వేలు.!

న్యూ ఇయర్ సందర్భంగా రైతులకు   కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది.  పీఎం కిసాన్ డబ్బులను ఇక నుంచి రూ. 6 వేల నుంచి 10 వేలకు పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు 2025 జనవరి 1న  ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది.  కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది.

2019 నుంచి మోదీ సర్కార్  చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. రైతులకు ఆర్థికసాయంగా ఏడాదిలో మూడుసార్లు రూ. 2వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. 

Also Read :- బంగారం లక్ష.. వెండి లక్షా 25 వేలు

అక్టోబర్ 5, 2024న 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ చేసింది.. ఇక19 వ విడత పిఎం కిసాన్ నిధులను రైతుల అకౌంట్లోకి జమ చేసేందుకు సిద్ధమయింది. పీఎం కిసాన్ యోజన నిధులు  2025 ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల అకౌంట్లో జమ చేయబడతాయని భావిస్తున్నారు. ఖచ్చితమైన తేదీ నిర్ధారించకపోయినప్పటికీ పీఎం కిసాన్ చెల్లింపు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఓ షెడ్యూల్ ప్రకారం జమ చేయబడతాయి.