ఏప్రిల్ నుంచి రైతుల ఖాతాల్లోకి  పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు

ఏప్రిల్ నుంచి రైతుల ఖాతాల్లోకి  పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు

రైతుల ఆర్థిక చేయూత కోసం కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకోని వచ్చింది. ప్రతి ఏడాది రైతుల ఖాతాలో 6వేల రూపాయలను కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని రైతులకు మూడు విడతలుగా అందజేస్తుంది. అంటే ప్రతి విడతలో వారికి రెండు వేల రూపాయలు లభిస్తాయి. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు కాగా మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 7 విడతల నగదును జమ చేసింది. 

ప్రస్తుతం 8వ విడతల డబ్బులను అందించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. నగదును ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్యలో దశల వారీగా రైతుల ఖాతాలో వేయనుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చేరని వారు మార్చి 31లోపు మీ పేరును పీఎం కిసాన్ అర్హుల లిస్టులో నమోదు చేసుకోవాలి. ఈ డబ్బులు మీకు వస్తాయా..లేదా అనేది తెలుసుకోవాలంటే మీ పేరు బెనిఫీసియరీ లిస్టులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు మీ అకౌంట్ లో జమకావు. కేవలం అందులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి.